YS Jagan : వైసీపీ కార్యకర్తలపై దాడులు.. ప్రధానికి మాజీ సీఎం జగన్ లేఖ

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జ‌గ‌న్‌ ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలచే విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం లేఖ రాశారు.

By :  Eha Tv
Update: 2024-07-19 04:17 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌. జ‌గ‌న్‌ ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలచే విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం లేఖ రాశారు. గత 45 రోజులుగా APలో జరుగుతున్న పరిణామాలపై చ‌ర్చించ‌డానికి జ‌గ‌న్‌.. ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయ‌ని తన లేఖలో ఉద్ఘాటించారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీల కార్యకర్తలు ఎన్నికల సమయంలో తమకు మద్దతివ్వని వారిని టార్గెట్ చేస్తున్నారని వివ‌రించారు.

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ చెందిన కార్య‌క‌ర్త‌లు మా పార్టీకి చెందిన‌ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ.. అవమానపరుస్తూ.. కొట్టి చంపుతున్నారు. వైసీపీకి చెందిన కార్యాల‌యాల‌తో స‌హా కార్య‌క‌ర్త‌ల‌ నివాస గృహాలను, ఆస్తుల‌ను ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలలో విస్తృత భయాన్ని కలిగిస్తున్నారని లేఖ‌లో పేర్కొన్నారు.

ప్రజలకు నిత్యావసర సేవలు అందించే గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్ క్లినిక్‌లను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్థాపించిందన్న కారణంగానే అధికార పార్టీ కార్యకర్తలు వాటిని ధ్వంసం చేశారని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. రాజశేఖర్ రెడ్డి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి స్థాపించారని పేర్కొన్నారు.

జూలై 17న వినుకొండలో YSRC కార్యకర్త రషీద్ దారుణంగా నరికి చంపబడ్డాడు. రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటన జరిగింది. ఆశ్చర్యకరంగా ఆ సమయంలో పోలీసులు చాలా దగ్గరగానే ఉన్నారని శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను ఎత్తి చూపారు. ముఖ్యంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్‌ ప్రదర్శించే రెడ్‌ బుక్‌ను గురించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించారు.

గత 40-45 రోజులుగా రాష్ట్రంలో "రెడ్ బుక్" రాజ్యాంగం నుడుస్తుంద‌న్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఒక్క నెలలోనే 31 హత్యలు, 300 హత్యాయత్నాలు,టీడీపీ వేధింపుల వల్ల 35 ఆత్మహత్యలు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, దాదాపు 2,700 కుటుంబాలు ఈ దారుణాల కారణంగా తమ గ్రామాలను వదిలి వెళ్లిపోయాయని వివ‌రించారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలనలో నెలకొన్న పరిస్థితులను ఈ ఘ‌ట‌న‌లు ప్రతిబింబిస్తాయ‌ని.. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడే విష‌యంలో ఇవి ఎంత‌మాత్రం మొగ్గుచూప‌ద‌గిన‌వి కావ‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News