YS Jagan Security: మాజీ సీఎం జగన్ కు కొత్త సెక్యూరిటీ

By :  Eha Tv
Update: 2024-06-18 03:12 GMT

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద 30 మందికి పైగా ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తక్కువ ఎమ్మెల్యే సీట్లు రావడంతో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఎమ్మెల్యేతో సమానంగా మాత్రమే భద్రత కల్పించే అవకాశం ఉంది. అందుకోసమే వైసీపీ అధినేతకు ప్రైవేట్ సెక్యూరిటీకి తీసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. గ్రే సఫారీ డ్రెస్‌తో ఉన్న సిబ్బందిని సోమవారం నుంచి జగన్ ఇంటిలోకి ప్రైవేట్ సెక్యూరిటీని అనుమతించారు.

నిబంధనల ప్రకారం.. అసెంబ్లీలో అత్యధిక స్థానాలను సాధించిన రెండో పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వబడుతుంది. అధికారిక గుర్తింపు పొందాలంటే ఆ పార్టీకి శాసనసభ మొత్తం సభ్యత్వంలో కనీసం 10 శాతం ఉండాలి. మే 13, 2024న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 135 సీట్లు గెలుచుకోగా, జనసేన 21 సీట్లు, YSRCP 11 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్‌సీపీకి తగినన్ని సీట్లు రాకపోవడంతో ప్రభుత్వం ఎమ్మెల్యేతో సమానంగా వైఎస్ జగన్ కు భద్రత కల్పిస్తోంది.


Tags:    

Similar News