4 లక్షల ఉద్యోగాలిస్తాం.. ఇచ్చామని చెప్పలేదు: లోకేష్
4 లక్షల ఉద్యోగాలిస్తాం.. ఇచ్చామని చెప్పలేదు: లోకేష్
మండలిలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ వరుద కల్యాణి గవర్నర్ ప్రసంగం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు రాశారని వరుదు కల్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్ లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ అన్నారు. కానీ తెలుగులో ఉన్న ప్రసంగాన్ని చూపించాలని వైసీపీ పట్టుబట్టింది. దీంతో లోకేష్ గవర్నర్ తెలుగు ప్రసంగ పత్రాలను చూపిస్తూ.. మూడో పేజీలో 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు, 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పాం కానీ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మేం చెప్పలేదని లోకేష్ అన్నారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్‌డీఏ మా మీద ఆధారపడి ఉందని ఎవరు చెప్పారని లోకేష్ ప్రశ్నించారు. కేంద్రానికి మేం బేషరతుగా మద్దతు ఇచ్చామని, తమపైనే ఎన్డీఏ ఆధారపడిందని ఎక్కడా చెప్పలేదన్నారు. దీనిపై బొత్స స్పందిస్తూ కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా, తమపై ఆధారపడలేదని లోకేష్ చెప్పగలరా అని ప్రశ్నించారు.