YSRCP Raptadu : రాప్తాడు వైసీపీలో ఏం జరుగుతోంది..నాయకుల మద్య కుమ్ములాటలు.. పార్టీ హైకమాండ్ రియాక్షన్ ఏంటి
రాప్తాడు అంటే వైసీపీలో టక్కున గుర్తుచేసింది తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కానీ ఈ మద్య ఇంకో పేరు బాగా వినిపిస్తోంది.

రాప్తాడు అంటే వైసీపీలో టక్కున గుర్తుచేసింది తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కానీ ఈ మద్య ఇంకో పేరు బాగా వినిపిస్తోంది. అతనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ . మాధవ్‌కి రాప్తాడుతో సంబంధం ఏంటి అనేగా మీ అనుమానం. అవును ఇప్పుడు తాను కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నానని బహిరంగంగానే ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. కొందరు మండల స్థాయి నాయకులు కూడా మాదవ్‌కు సపోర్టు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ మధ్య ప్రకాష్ కూడా ప్రెస్ మీట్లో లోకల్ లీడర్స్ మీద బహిరంగంగానే విమర్శలు చేశారు. తనకు వ్యతిరేకంగా అనంతవెంకట్రామిరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి అనంతపురం వేదికగా పనిచేస్తున్నారని చెప్పారు. తమ నియోజకవర్గానికి ఎవరు వైసీపీ నాయకుడు అన్న మిమాంసలో క్యాడర్ కూడా ఉన్నారు. ఈ మధ్య న్యూఇయర్ సందర్బంగా ఇరువర్గాలు పోటాపోటీగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాప్తాడు మండల స్థాయి నాయకులను పార్టీ సస్పెండ్ చేయడంతో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుందని గుసగుసలాడుకుంటున్నారు. మరి గోరంట్ల మాధవ్ ఎలాంటి స్టెప్స్ వేస్తారా అని కార్యకర్తలు ఆసక్తిగా ఉన్నారు.
