Tirumala: తిరుమలకు వెళ్తున్నారా.. ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి
By : Eha Tv
Update: 2024-06-15 02:34 GMT
తిరుమల దర్శనానికి వెళ్లాలని అనుకుంటూ ఉన్నారా.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు పొందిన భక్తులు జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.జూన్ 25న టీటీడీ స్థానిక ఆలయాల్లో శ్రీవారి సేవ కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.