ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

By :  ehatv
Update: 2025-01-17 05:53 GMT

దేశంలో ఈవీఎంలకు (EVM) సంబంధించిన చర్చ చాలా విస్తృతంగా నడుస్తోంది. మనం కూడా జర్నలిస్ట్ వైఎన్‌ఆర్ చానెల్‌ ద్వారా ఈవీఎంలపై జరుగుతోన్న చర్చను తెలుగురాష్ట్రాల ప్రజల ముందుకు చాలా సార్లు తీసుకొచ్చాం. తాజాగా ఈవీఎంల అంశాన్ని మరొక తేనేతుట్టె అంశాన్ని ఈసీ (Election Commission of India)కదిలించింది. సీసీటీవీ ద్వారా లేదా వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ సంబంధించిన సమాచారం తెలుసుకునే అంశం ఉండేది. అయితే ఇది పబ్లిక్ డొమైన్‌లో పెట్టడానికి వీల్లేదు, రహస్యంగా ఉంచాలని కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించింది. 1961 ప్రకారం ఎన్నికల నిబంధనలను సవరణ చేయాలని నిర్ణయించింది. దాని ప్రకారం వెబ్‌కాస్టింగ్ ద్వారా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎన్నికలకు సంబంధించిన అంశం ఎవరికీ లేకుండా చేయాలని ఈసీ అనుకుంది. ఇప్పటికే ఈ దేశంలో ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, ఈవీఎంలు మిస్‌ప్లేస్ అవుతున్నాయి.. ఈవీఎంలున్నప్పటికీ రిగ్గింగ్‌ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ ఫుటేజ్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాల్సిన అవసరం లేదు అంటూ ఎలక్షన్ కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇందుకు సంబంధించిన బేస్‌ ఏంటి, పర్పస్‌ ఏంటి అనేది ఎన్నికల కమిషన్‌ చెప్పలేకపోతోంది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' లోతైన విశ్లేషణ ఈ వీడియోలో..!

Tags:    

Similar News