Aghori Warning: మా జోలికొస్తే.. కేదార్‌నాథ్‌లో అఘోరీ, వర్షిణి ఆత్మర్పణం..
Aghori Warning: మా జోలికొస్తే.. కేదార్‌నాథ్‌లో అఘోరీ, వర్షిణి ఆత్మర్పణం..
తమ అరెస్ట్ వార్తలపై అఘోరీ, వర్షిణి తీవ్రంగా స్పందించారు. తమ జోలికి ఎవరు రావొద్దని, తమను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కేదార్‌నాథ్ వెళ్లిపోతున్నాం. జీవితాంతం అక్కడే ఉంటాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టం' అని తెలిపారు. అంతేకాదు దేశంలో వేరే సమస్యలు లేవా? అంతా తమ వెంట ఎందుకు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా గురించి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు. మా బతుకేదో మేము బతుకుతున్నామని.. ఉత్తరాఖండ్ వెళ్లిపోతున్నాం. మా గురించి తప్పా వేరే విషయాలు దొరకట్లేదా. మీడియా మా వెంట ఎందుకు పడుతోంది. మా జోలికొస్తే పెట్రోల్ పోసుకుని మరణిస్తాం. రెండు ప్రాణాలు పోవడానికి మాపై ట్రోలింగ్ చేస్తున్నవారు, కేసులు పెడుతున్నవారు, విమర్శిస్తున్నవారు కారణం. ఆసత్య ప్రచారం ఆపండి. మమ్మల్ని ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు. మీడియాలోనూ మా గురించి తప్పుగా ప్రచారం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. మేము చెప్తున్నది 100 శాతం నిజం' అని చెప్పారు.
అంతేకాదు అఘోరీ మొదటి భార్య గురించి మాట్లాడుతూ.. అదంతా ఉట్టిదేనని కొట్టిపారేసింది. ఆధారాలు లేకుండా వచ్చి తాను అఘోరీ మొదటి భార్యను అని చెప్తే నమ్మబోమని తెలిపింది. అఘోరికి నేనే మొదటి భార్యను. ఇంకెవరు లేరు. మేము ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటాం. దయచేసి మా దగ్గరకు రావొద్దని కోరింది. ఇక తనను బలి చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమని చెప్పింది. ఇక అఘోరి పేరు మీద డబ్బులు వేసిన వ్యక్తి కేసు పెడితేనే చెల్లుతుందని, ఎవరో పెడితే ఎందుకు కేసు అవుతుందని ప్రశ్నించింది. తెలంగాణలో జోగినిలు కూడా అఘోరీపై మండిపడుతున్నారు. యోని పూజలు చేసి డబ్బులు వసూల్ చేసిందని, వ్యాపారులను కూడా నమ్మించి ముంచేసిందని ఆరోపిస్తున్నారు. దీంతో వాళ్లు కేదార్‌నాథ్ వెళ్లిపోతున్నామని.. ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారన్న భయంతోనే అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారని తెలుస్తోంది.