రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నావని సూటి ప్రశ్నలు, రాజధాని కోసం ఇప్పటికే 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి ?

రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నావని సూటి ప్రశ్నలు, రాజధాని కోసం ఇప్పటికే 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి ? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా ? అని ఆయన మండిపడ్డారు. రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉందని.. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే అని ఆయన అన్నారు. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు, ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ? రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటున్నారు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీ(Ap)లో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయాలని చెప్పడం చంద్రబాబు(Chandra babu) అనాలోచిత.. తొందరపాటు చర్య అని శోభనాద్రీశ్వరరావు(Vadde Sobhanadreeswara Rao) అన్నారు. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి ? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా? ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా? 40 అంతస్తుల బిల్డింగ్‌లు ప్రజలకు ఒరిగేదేంటి ? ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు? ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి? అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి? శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే మీకు కనిపించడం లేదా? చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడాలని వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ? మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదా.. 2019 నుండి 2023 వరకు జరిగిన పరిణామాలను గమనించిన చంద్రబాబు నాయుడు తన ద్రుష్టి మార్చుకుని చక్కని పరిపాలన సాధిస్తాడనుకున్న ప్రజల ఆశయం తప్పని నిరూపిస్తూ తన యధాతధ ప్రవర్తనతో పాలన సాగిస్తుండటం ఆయనకే చెల్లింది, రాష్ట్ర ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడి రోజురోజుకు నిరుద్యోగం, పేదరికం పెరుగుతుంటే తను మాత్రం టెక్నాలజీ అడ్డుపెట్టుకుని అరచేతిలో వైకుంఠం చూపటం విశేషమని శోభనాద్రీశ్వరరావు అన్నారు.

ehatv

ehatv

Next Story