Russia Anantapur: అనంతపురం మేయర్ కు రష్యా నుండి ఆహ్వానం
By : Eha Tv
Update: 2024-06-17 04:41 GMT
రష్యాలోని కజాన్ నగర మేయర్ బ్రిక్స్+ అసోసియేషన్ ఆఫ్ సిటీస్ అండ్ మునిసిపాలిటీస్‌లోని నగరాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే విస్తృత చొరవలో భాగంగా అనంతపురం మేయర్ మహ్మద్ వసీమ్ సలీమ్‌ను కజాన్‌కు ఆహ్వానించారు.ఈ సంఘం దాదాపు 50 మంది మేయర్‌లను కజాన్‌కు ఆహ్వానించారు. వీరిలో నలుగురు భారతీయ నగరాలైన కాలికట్, త్రిస్సూర్, జైపూర్, నాగర్‌కోయిల్‌లకు చెందిన వారు ఉన్నారు. రష్యాతో ఉన్న చారిత్రక అనుబంధం కారణంగా అనంతపురం మేయర్ ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది.
550 ఏళ్ల కిందట రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించారు. ఆ అంశాలు ఇటీవల కజాన్‌లో జరిగిన అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశంలో చర్చకు వచ్చాయి. రష్యన్ యాత్రికుని రచనలను పరిగణనలోకి తీసుకుని మేయర్ల సదస్సుకు అనంతపురం మేయర్ కు ఆహ్వానం దక్కింది. ఈ చారిత్రాత్మక బంధం కజాన్‌లో జరిగిన అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశంలో అనంతపురంను ముఖ్యమైన భాగస్వామ్యమని అనంతపురం మేయర్ తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలలో విస్తరించి ఉన్న చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉన్న అనంతపురం గురించి ఇతర మేయర్‌లకు తెలియజేస్తానని చెప్పారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో ప్రాచీన సంప్రదాయాలను నేటి పాలకులు కొనసాగిస్తున్నారని మేయర్ వివరించారు.