Rain Alert : మరో ఐదురోజులు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. సముద్రమట్టానికి 1.5 కి.మీ.ఎత్తులో అల్పపీడనం కేంద్రీకృత‌మై ఉంది.

By :  Eha Tv
Update: 2024-07-16 03:51 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. సముద్రమట్టానికి 1.5 కి.మీ.ఎత్తులో అల్పపీడనం కేంద్రీకృత‌మై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం తోడ‌వ‌డంతో వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. ఇదే కాకుండా.. ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్ప‌డ‌నుంది. దీంతో ఏపీ, తెలంగాణల‌కు భారీ వ‌ర్ష సూచ‌న ఉంది. వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది.

Tags:    

Similar News