Rain Alert : ఏపీకి భారీ వర్ష హెచ్చరిక
ఒడిశా అంతర్భాగంపై వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి బలహీనపడిన తీవ్ర వాయుగుండం వాయుగుండంగా మారిందని వెల్లడించింది
ఒడిశా అంతర్భాగంపై వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి బలహీనపడిన తీవ్ర వాయుగుండం వాయుగుండంగా మారిందని వెల్లడించింది. ఝార్సుగూడకి ఆగ్నేయంగా 70 కి.మీ.. సంబల్‌పూర్ కి తూర్పున 60 కి.మీ.. బిలాస్‌పూర్‌కి తూర్పు-ఆగ్నేయంగా 250 కి.మీ.. రాయ్‌పూర్ కి తూర్పున 290 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యిందని వివరించింది. ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు సాయంత్రం నాటికి చత్తీస్‌గఢ్ మరియు ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఉత్తరాంద్ర తీరంలో ఈరోజు, రేపు మత్య్సకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.