టీడీపీకి మళ్లీ ఝలక్ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌..!

టీడీపీకి మళ్లీ ఝలక్ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌..!

By :  ehatv
Update: 2025-01-17 05:12 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కూటమిలోని ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీకి (TDP) వరుసగా ఝలక్‌లు ఇస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి పవన్ ఝలక్‌లు ఇస్తున్నారనే విషయాన్ని వైసీపీ చెప్తోంది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా కూటమిలో చీలిక రావాలని కోరుకుంటోంది కాబట్టి. కానీ వైసీపీ చెప్తున్న ప్రకటనలు పక్కనపెట్టి చూస్తే నిజంగానే కూటమి ప్రభుత్వానికి పవన్‌ కల్యాణ్‌ నిజంగానే ఝలక్‌లు ఇస్తున్నారని ఆయన వైఖరి బట్టి తెలుస్తోంది. కూటమిలో కూడా తనకు ఒక ప్రత్యేకమైన స్టయిల్ ఉంటుంది, తనకు ప్రత్యేకమైన ఎజెండా ఉంది, తన ఎజెండాతోనే పనిచేస్తాననని స్పష్టంగా పదేపదే చెప్పుకొచ్చారు. కాకినాడ పోర్టు దగ్గర ఆయన మాటలు, ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు, తిరుపతి ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందన్న మాటలను చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఆయన ఇండివీడ్యుయెల్‌గా తన బాధ్యతలు చెప్తూ వస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం, జనసేన అధినేత పవన్ నిర్ణయం వేరుగా ఉన్నా కానీ ఆయన బహిరంగంగా చెప్పడానికి సంకోచించడం లేదు. ఈ సందర్భంగా జనసేన విడుదల చేసిన లేఖలో ఏముంది. ఇందులో కూటమి ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చే అంశం ఏంటి.. సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' లోతైన విశ్లేషణ ఈ వీడియోలో..!

Tags:    

Similar News