నారా లోకేష్ (Nara Lokesh) పట్టాభిషేకానికి ఏర్పాటు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన యాక్టింగ్ సీఎంగా, సూడో సీఎంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్, టీడీపీ నాయకులకు ఇదే తెలుస్తోంది. కానీ బయటనుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉన్నారు. అన్ని ఇష్యూస్‌ను ఇండిపెండెంట్‌గా అడ్రస్ చేస్తున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అన్ని సమస్యలపై స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే తరహా మాటలను మాట్లాడుతున్నారు. గడిచిన ఏడు నెలల కాలంలో ఎక్కువగా అటెన్షన్ డ్రా చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఏడు నెలల కాలంలో చంద్రబాబు (CM Chandra Babu) పెద్దగా కనపడకపోయినా.. పవన్ కల్యాణ్ ఎక్కువగా కనిపిస్తున్నారు. పరిపాలన, కొత్త కార్యక్రమాల ద్వారా కాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ కనపడతున్నారు. ఈ సర్కార్ చేస్తున్నవి తప్పులంటూ ఆ తప్పులను సరిదిద్దడం ద్వారా కనపడుతున్నారు. పవన్ చెప్పినట్లు తప్పులను సర్కార్ తన తీరును మార్చుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న మీడియా.. 'నారా లోకేష్‌ను ఇప్పుడు పట్టించుకోకపోతే ఎలా' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. లోకేష్‌ను లేపడంతో ఈ మీడియా పాత్ర ఏంటో సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!