Andhra Pradesh : ఎమ్మెల్సీ ఎన్నిక.. 'బొత్స' ఓట‌మే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు

ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Election) కోసం టీడీపీ(TDP) వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వైసీపీ అభ్య‌ర్ధి, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌(Botsa Satyanarayana)ను ఓడించేందుకు టీడీపీ ప్లాన్ వేస్తోంది.

Update: 2024-08-06 03:15 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Election) కోసం టీడీపీ(TDP) వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వైసీపీ అభ్య‌ర్ధి, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌(Botsa Satyanarayana)ను ఓడించేందుకు టీడీపీ ప్లాన్ వేస్తోంది. ఈ మేర‌కు టీడీపీ సీనియర్‌లు పల్లా శ్రీనివాస్(Palla Srinivas) ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో స్పీక‌ర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu), అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం రమేష్(CM Ramesh), ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీ అరకు, పాడేరు వైసీపీ ఎంపీటీసీ(MPTC)లు, జెడ్పీటీసీ(ZPTC)లపై ఫోకస్ పెట్టింది. ఈ క్ర‌మంలోనే సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజ‌ర‌య్యార‌ని.. వారిని అమరావతి క్యాంపుకు తరలించనున్నట్లు.. 25 రోజుల పాటు క్యాంపును కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్(Peela Govindh) పేరు దాదాపు ఖరారు అయ్యింది. జనసేన(Janasena)కు అనకాపల్లి(Anakapalli) టికెట్ కేటాయించడంతో గోవింద్‌కు గ‌త ఎన్నిక‌ల్లో అవకాశం దక్కలేదు. ఆర్ధికంగాను గోవింద్ సరైన అభ్యర్థి కావడంతో అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఉత్త‌రాంధ్ర‌లో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడైన బొత్సను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీ నేతలు ముందుకు వెళ్తున్నారు. 

Tags:    

Similar News