Minister Nadendla Manohar : ప్రజా ధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం

'ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీ(Jagananna Colonies)ల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాద'ని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు.

Update: 2024-08-05 03:34 GMT

'ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీ(Jagananna Colonies)ల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాద'ని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) అన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లనూ, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

తెనాలి(Tenali) నియోజకవర్గంలో గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు పెదరావూరు, సిరిపురం(Siripuram), దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మిస్తున్న లే అవుట్లను పరిశీలించారు. లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో ఆయ‌న మాట్లాడుతూ.. “కాగితాల్లో చూపించిన దానికి, వాస్తవ పరిస్థితికి అసలు పొంతన లేదు. వందల కోట్లు ఖర్చు అయినట్లు చూపిస్తున్నారు తప్ప కనీసం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించలేకపోయారు.

చిన్నపాటి వర్షానికి లే అవుట్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు(Roads), డ్రైనేజీ, తాగు నీరు(Drinking Water), కరెంటు(Electricity).. ఇలా ప్రతీది సమస్యే. పట్టాలు ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. మరికొంత మంది లబ్ధిదారులను ఇళ్లు నిర్మిస్తామని డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్లు మోసం చేశారరు. ప్రతి లే అవుట్లో సవాలక్ష సమస్యలు. బటన్లు నొక్కా.. బటన్లు నొక్కా అని పదే పదే చెప్పిన మాజీ సీఎం జగన్ ఎవరికి లబ్ధి చేకూర్చారో మాత్రం చెప్పలేదన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గంజాయి బ్యాచ్, మందు బాబులు రెచ్చిపోతున్నారు. సొంతింటి కోసం కలలు కన్న ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చేస్తాం. వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం నింపుతామ‌న్నారు. 

Tags:    

Similar News