తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్‌ విసిరింది.

తిరుపతి నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని భూమనకు టీడీపీ సవాల్‌ విసిరింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని సవాల్ చేసింది. దీంతో, టీడీపీ(TDP) ఛాలెంజ్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy)స్వీకరించారు. ఈరోజు గోశాలకు వెళ్తానని భూమన తెలిపారు. ఈ క్రమంలో భూమనతో పాటు, తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ(Ysrcp) ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. భూమన హౌస్‌ అరెస్ట్‌పై తిరుపతి (Tirupati)జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మాట్లాడారు. ఈ క్రమంలో భూమన కరుణాకరరెడ్డి రెడ్డి ఒక్కరినే గోశాలకు అనుమతిస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్లాలని సూచించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు అని భూమన మండిపడ్డారు.

ehatv

ehatv

Next Story