వంశీని పరామర్శించనున్న జూ.ఎన్టీఆర్..?
వంశీని పరామర్శించనున్న జూ.ఎన్టీఆర్..?
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట చేసి విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపర్చారు. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించారు. కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్‌లో పరామర్శించిన జగన్.. ఆమెకు భరోసా ఇచ్చారు. వల్లభనేని వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. జగన్ పర్యటన సందర్భంగా జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కొసమెరుపు ఏంటంటే జూ.ఎన్టీఆర్, వంశీ స్నేహితులన్న విషయం మనందరికీ తెల్సిందే. జైలులో ఉన్న వల్లభనేని వంశీని జూ.ఎన్టీఆర్ పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వంశీపై కేసు నమోదు చేయించి జైలుకు పంపగా.. జూ.ఎన్టీఆర్ వంశీని పరామర్శించేందుకు వెళ్లడం విశేషమే అవుతుంది. వల్లభనేని వంశీ తరపున ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌తో పాటుగా వంశీ మెడికల్ రిపోర్టులతో మరో పిటిషన్ కూడా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యేక వైద్య వసతులు, ఇంటి నుంచే ఆహారం అందించే సదుపాయం కల్పించాలని కోరారు. మరోవైపు.. ఇప్పటికే వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.