Andhra Pradesh : కలెక్టర్లతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కీలక సమావేశం.. షెడ్యూల్ ఇదే..!
కలెక్టర్ల(Collectors)తో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సమావేశం అయ్యారు.
కలెక్టర్ల(Collectors)తో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(Neerab Kumar Prasad), రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా(RP Sisodia), సిసిఎల్ఏ జయలక్మి(Jayalakshmi), పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.
ఒక రోజు కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఉ.10గం.ల నుండి ఉ.11.15గం.ల వరకు ప్రారంభ(Inaugural Session)కార్యక్రమం ఉంటుంది. సీఎం కీలకోపన్యాసం, డిప్యూటీ సీఎం సందేశం, రెవెన్యూ శాఖ మంత్రి ప్రారంభ సందేశం ఇస్తారు. ఆ తర్వాత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతారు. సిసిఎల్ఏ జయలక్మి స్వాగతం పలుకుతారు.
ఉ.11.15 గం.ల నుండి 12.25 గం.ల వరకు ప్రాధమిక రంగం,12.25గం.ల నుండి 12.55 గం.ల వరకు సహజ వనరులపై సమీక్షిస్తారు.తదుపరి 12.55గం.ల నుండి 1.50.గం.ల వరకు సెకండరీ సెక్టార్, మౌలిక సదుపాయాలపై సమీక్షిస్తారు.భోజన విరామం అనంతరం 2.45గం.ల నుండి 3.30గం.ల వరకు మానవ వనరులు,3.30 నుండి 4.20.గం.ల వరకు సోషల్ సెక్టార్, సంక్షేమం,4.20.గం.ల నుండి 4.40.గం.ల వరకు హెల్తు సెక్టార్,4.50గం.ల నుండి 5.40గం.ల వరకు అర్బన్ మరియు రూరల్ డెవలప్మెంట్,5.40.గం.ల నుండి 5.50 గం.ల వరకు సర్వీస్ సెక్టార్,5.50.గం.ల నుండి 6.20.గం.ల వరకు రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలపై సమీక్షిస్తారు.6.20.గం.ల నుండి 7గం.ల వరకు శాంతి భద్రతలు,7గం.ల నుండి 7.30.గం.ల వరకు ఓపెన్ హౌస్,7.30.గం.ల నుండి 7.45.గం.ల వరకు క్లోజింగ్ రిమార్కులు, తదుపరి వందన సమర్పణ ఉంటుంది.