IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

IAS Transfers In Andhra Pradesh

By :  Eha Tv
Update: 2024-06-20 02:20 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జ‌రిగాయి. రాష్ట్రంలో ఒకేసారి 19 మంది ఐఏఎస్‌ లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అధికారుల బ‌దిలీల వివ‌రాలు..

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్‌.

ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ్ జీఏడీకి.

పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీఏడీకి అటాచ్‌.

జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్‌.

వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌.

కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది.

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌.

పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌.

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌ గౌర్‌.

నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌కు అదనపు బాధ్యతలు.

పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్‌.

ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు.

ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.

ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌.

ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న.

ఆర్థికశాఖ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి.

పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం. నాయక్‌.

గనులశాఖ కమిషనర్‌, డైరెక్టర్‌గా తిరుపతి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌.

ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు.

తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు.

ఆర్థికశాఖ కార్యదర్శిగా వాడరేవు వినయ్‌ చంద్‌

Tags:    

Similar News