అపచారం.. అపచారం.. తిరుమలలో ఏం జరుగుతోంది 'స్వామీ'

అపచారం.. అపచారం.. తిరుమలలో ఏం జరుగుతోంది 'స్వామీ'

By :  ehatv
Update: 2025-01-18 10:39 GMT

తిరుమల కొండపై మరోసారి అపచారం చోటు చేసుకుంది. కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం తిరుమలలో కలకలం రేపుతోంది. ‌వారి ఆల‌యానికి స‌మీపంలోని రాంభ‌గీచా బ‌స్టాండ్ వ‌ద్ద పలావ్ అన్నం, అందులో గుడ్లతో కూడిన భోజ‌నాన్ని కొంత మంది భ‌క్తులు తింటున్నార‌ని విజిలెన్స్ అధికారుల‌కు ఫిర్యాదు అందింది. దీంతో వాళ్ల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుమలలో గత కొన్ని దశాబ్దాలుగా మాంసాహారం నిషేధం. భక్తులనెవరినీ కొండపైకి మాంసాహారం అనుమతించరు. ఎప్పుడూ లేని విధంగా తిరుమ‌ల‌లో ఎందుకు ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయ‌ని భక్తులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తిరుమ‌ల‌లో హిందువుల భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హారాలు న‌డుస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో లడ్డూ వివాదం, తిరుపతిలో తొక్కిసలాట, ఇతరత్రా అపశృతులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైకి గుడ్లు, పలావ్‌ అన్నం సరఫరా అవుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయన్నారు. ఇదే జగన్ పాలనలో జరిగి ఉంటే టీడీపీ, జనసేన, వారి భజన మీడియా నానా రాద్ధాంతం చేసేవని.. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే సమీక్షించి భక్తుల మనోభావాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News