Buddha Venkanna : జగన్ లేఖకు బుద్ధా వెంకన్న కౌంటర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు టీడీపీ నేత బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ రాయడంతో అందుకు కౌంటర్‌గా బుద్ధా వెంకన్న లెటర్ రాశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు టీడీపీ నేత బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ రాయడంతో అందుకు కౌంటర్‌గా బుద్ధా వెంకన్న లెటర్ రాశారు. ఆయన లేఖలో.. గతంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. నలుగురిని లాక్కొని.. ఇంకా ఇద్దరిని లాక్కుందామని ప్రయత్నించి.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామనుకుంది నువ్వు కాదా అని ప్రశ్నించారు.
ఒకసారి రాజ్యాంగ నిపుణులను కనుక్కొని లేఖ రాయాల్సింది.. నీకు ఇంకా పదవీకాంక్ష తీరలేదా అని దుయ్యబట్టారు. స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. ఆయన స్నీకర్‌గా బాధ్యతలు చేపట్టకముందువని అన్నారు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అయ్యన్న పాత్రుడుపై చేసిన వ్యాఖ్యలు చూస్తే.. మీకు ప్రతిపక్ష హోదా కాదు కదా అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా లేదని ఎద్దేవా చేశారు. మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది ప్రజలే.. చంద్రబాబు కాదు అని బుద్ధా వెంకన్న లేఖలో పేర్కొన్నారు.
అంతకు ముందు జగన్ లేఖలో.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధమని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే అధికార ఎన్డీయే కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన నిర్ణయించినట్టుందని జగన్ పేర్కొన్నారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఈ హోదా కోసం 10% సీట్లు ఉండాలని చట్టంలో లేదు అని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజాసమస్యలను బలంగా వినిపించొచ్చని తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని స్పీకర్ తన లేఖను పరిశీలించాలని కోరుతున్నానని పేర్కొన్నారు