Buddha Venkanna : ప్రజలు జగన్‌ను మరోసారి నమ్మే అవకాశం లేదు

టీడీపీ నేత బుద్ధ వెంకన్న మ‌రోసారి మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

By :  Eha Tv
Update: 2024-07-17 07:52 GMT

టీడీపీ నేత బుద్ధ వెంకన్న మ‌రోసారి మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. విజయవాడలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వాతలు పెట్టినా జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏందో తెలుసా.. ఎప్పుడైనా వైసీపీ వాళ్లు శ్వేత పత్రాలు విడుదల చేశారా అని ప్ర‌శ్నించారు.

చంద్రబాబు పోలవరం వెళ్లడం తప్పా.. పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంతో చంద్రబాబు పర్యటన చేస్తున్నారని. మీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్ లు పెడుతున్నారని అన్నారు.

చంద్రబాబు సీఎం అవ్వగానే పెంచిన పింఛన్ ను అందించారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక కూల్చారు. అసలు చెత్త పన్ను వేసింది ఎవరు.? మీరు ఐదు సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని చెత్తగా మార్చేశారు. ఆ చెత్తంతా చంద్రబాబు క్లీన్ చేస్తున్నారని.. 35 రోజుల్లోనే ఆ చెత్త అంత క్లీన్ అయిపోతుందా...? అని అడిగారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ టూర్లు చేస్తున్నార‌ని.. ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి పని చేశాడా అని ప్ర‌శ్నించారు. దోచుకున్న లక్షల కోట్లతో సోషల్ మీడియాని నడిపిస్తున్నారు. దోచుకున్న డబ్బులతో సోషల్ మీడియాతో కూటమినేతలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఇప్పటికీ ప్రజలు వైసీపీ పార్టీని అసహ్యించుకుంటున్నారు. ఆ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు ఆలోచిస్తున్నారు. పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండు అనుకుంటున్నారని అన్నారు.

పేర్ని నాని బందర్ ను ఏం అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు పోర్టు అనేది పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తారు. మచిలీపట్నానికి 70,000 కోట్లతో బిపిసిఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం అనేది ఇంకా కలేన‌న్నారు.

చంద్రబాబుకు మరో అవకాశం వచ్చినట్లు, తమకి కూడా అధికారం వస్తుంది అని వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారు. చంద్రబాబు రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడుని ప్రజలు నమ్మారు కాబట్టి అధికారంలోకి వచ్చాము. జగన్‌ను ప్రజలు మరోసారి నమ్మే అవకాశం లేదన్నారు.

వైసీపీ నేతలు కాజేసిన డబ్బు గురించి ప్రజలకు చెప్పడం తప్పా.. జగన్ భవంతుల‌లో ఉండొచ్చు కానీ.. పేదవాళ్లు సొంత నివాసాల్లో ఉండకూడదా అని ప్ర‌శ్నించారు. టిడ్కో ఇల్లు ఎందుకు జగన్ పూర్తి చేయలేకపోయాడు. గాలి మాటలు చెప్పడం వైసీపీ నేతలు మనుకోవాలన్నారు. 2024 నుంచీ 2029 వ‌ర‌కూ రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయో.. జగన్‌కు తెలుసా అని ప్ర‌శ్నించారు. ఇప్పటికే ప్రజలు ఓటు రూపంతో వైసీపీ నేతలకు వాతలు పెట్టారు. నిజంగా కొలిమిలో కడ్డీ పెట్టి వాత పెట్టేదాకా తెచ్చుకోవద్దన్నారు. 

Tags:    

Similar News