AP TET : ఏపీ టెట్ సిలబస్ గురించి అపోహ వద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

By :  Eha Tv
Update: 2024-07-03 04:17 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలు ఇప్పటికే వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అయితే పాత సిలబస్ ఉంచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని ఆయ‌న‌ తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు పడకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిర్ణయించిన సిలబస్ నే ప్రస్తుత ఉపాధ్యాయ అర్హత పరీక్షకు కూడా నిర్ధారించటం జరిగిందని, దానినే వెబ్ సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియచేశారు.

Tags:    

Similar News