Divvela Madhuri : పోలీసులను ఆశ్రయించిన దివ్వెల మాధురి
సోషల్ మీడియాలో(Social media) యాక్టివ్గా ఉన్నవారికి దివ్వెల మాధురి(Divvela madhuri) తెలియకుండా ఉండదు.
సోషల్ మీడియాలో(Social media) యాక్టివ్గా ఉన్నవారికి దివ్వెల మాధురి(Divvela madhuri) తెలియకుండా ఉండదు. సోషల్ మీడియాలో ఆమె పాపులర్. ఇప్పుడామో పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనతో పాటు దువ్వాడ శ్రీనుపై(Duvvada srinu) అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధురి. వీడియో ఆధారాలతో టెక్కలి పోలీసు స్టేషన్లో(Tekkali police station) ఫిర్యాదు చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మాధురితో పాటు పోలీసు స్టేషన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వచ్చారు. అయితే వారిని స్టేషన్లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ వాగ్వాదం జరిగింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, అనుచితమైన కామెంట్లు చేస్తున్నవారిని వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి అనిత(Anitha vangalapudi) ప్రకటన విన్న తర్వాత తాను పోలీసులకు కంప్లయింట్ చేశానని, మరి పోలీసులు యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలని మాధురి చెప్పారు. గతంలో దువ్వాడ మాట్లాడిన మాటలపై కేసులు పెట్టిన పోలీసులు తమపై చేసిన కామెంట్లపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు మాధురి.