ఇటీవల హర్యానా అసెంబ్లీకి(Haryana Assembly) జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ(BJP) విజయం సాధించింది.

ఇటీవల హర్యానా అసెంబ్లీకి(Haryana Assembly) జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ(BJP) విజయం సాధించింది. నిజానికి కాంగ్రెస్‌(Congress) పార్టీ గెలుస్తుందని అనుకున్నారంతా! అన్ని సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్(Exist polls) కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పాయి. ఫలితాలు మాత్రం రివర్స్‌ అయ్యాయి. అప్పుడు బీజేపీ వ్యతిరేకులంతా హర్యానాలో ఏదో జరిగే ఉంటుందని అన్నారు. ఈవీఎంలలో గడబిడ జరిగి ఉంటుందని సందేహించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) కూడా ఎక్స్‌ వేదికగా రియాక్టయ్యారు. అప్పుడాయన ఏమన్నారంటే 'ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు వ్య‌తిరేకంగా ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాదిరిగానే హ‌ర్యానాలో కూడా అసెంబ్లీ ఫ‌లితాలు ప్ర‌జాభిప్రాయాన్ని గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయి. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల్లో విశ్వాసం నింపేందుకు చ‌ట్ట‌స‌భ స‌భ్యులు ముందుకు రావాలి. ఏపీలో ఇప్ప‌టికే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కోర్టుల్లో కేసులు న‌డుస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికీ బ్యాలెట్‌ల‌నే వాడుతున్నారు. అమెరికా, యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, స్విట్జ‌ర్లాండ్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, జపాన్‌, నార్వే, డెన్మార్క్ స‌హా చాలా అభివృద్ధి చెందిన‌ దేశాల్లో ఇప్ప‌టికీ పేప‌ర్ బ్యాలెట్‌ను వాడుతున్నారు. మ‌నం కూడా బ్యాలెట్ల‌కే వెళ్ల‌డం మంచిది' అని ట్వీట్‌ చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఊహించని ఫలితాలే వచ్చాయి. మహా వికాస్‌ అఘాడి గెలుస్తుదనుకుంటే ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ నేతలు కూడా ఇంత గొప్ప విజయాన్ని ఊహించి ఉండరు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న విపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో చతికిలపడిన ఎన్డీయే కూటమి ఇప్పుడు ఇంతటి విజయాన్ని సాధించడమేమిటని నిలదీస్తున్నాయి. అధికార కూట‌మిపై వ్య‌తిరేక‌త తప్పనిసరిగా వుంటుంద‌ని, అలాంటిది అప‌రిమిత‌మైన అధికారం ద‌క్క‌డం ఏమిటనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. మ‌రోసారి బ్యాలెట్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అయితే జగన్మోహన్‌రెడ్డి ఈ సారి మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై పెదవి విప్పడం లేదు.

Eha Tv

Eha Tv

Next Story