AP High Court : వైసీపీకి హైకోర్టులో ఊర‌ట

ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తేనే.. వాటిని కూల్చివేసేందుకు అధికారాన్ని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

By :  Eha Tv
Update: 2024-07-05 04:02 GMT

ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తేనే.. వాటిని కూల్చివేసేందుకు అధికారాన్ని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని ప‌లు చోట్ల వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వ‌డంపై ఆ పార్టీ హైకోన్టులో పిటీష‌న్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన తర్వాత కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణంలో అవకతవకలు తక్కువ లేదా చిన్నవిగా ఉండి.. ప్రజలను పెద్దగా ప్రభావితం చేయనట్లయితే.. ప్రభుత్వ అధికారులు వాటిని కూల్చివేయరాదని కోర్టు పేర్కొంది. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించే విధంగా ఉంటే తప్ప కూల్చివేత అధికారాన్ని ఆశ్రయించకూడదని కోర్టు పేర్కొంది. చట్టానికి అనుగుణంగా విధి విధానాలను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.

వైసీపీ తన జిల్లా కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన పత్రాలు, వివరణలు, ఇతర రుజువులను పక్షం రోజుల్లో సమర్పించాల‌ని ఆదేశించింది. వైసీపీకి విచారణకు సంబంధించి తగిన అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణ స‌మ‌యంలో నిర్మాణాలపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కూడా పేర్కొంది.

చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న అన్ని పరిష్కారాలను పొందేందుకు వైసీపీకి అనుమతిస్తూ.. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది.

ఇటీవల తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న YSRCP కేంద్ర పార్టీ కార్యాలయం కూల్చివేత నేపథ్యంలో రాష్ట్రంలో పెద్ద వివాదం చెలరేగింది. అలాగే వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాలకు కూడా నోటీసులు వచ్చాయి.

బీజేపీ-జనసేన-టీడీపీ కూట‌మి ప్రభుత్వం కూడా వైసీపీకి చెందిన 18 కార్యాలయాలు ‘పూర్తిగా అనధికార భవనాలు’ అని ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యాలయాల విలువ రూ.2,000 కోట్లుగా అంచనా వేశారు.

Tags:    

Similar News