Andhra Pradesh : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

By :  Eha Tv
Update: 2024-07-21 03:58 GMT

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం 62 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పిఎస్ గిరీషాను ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ మ‌రియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2012 బ్యాచ్‌కు చెందిన‌ IAS అధికారి మంజీర్ జీలానీ సమూన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (AP MARKFED) MDగా నియమితులయ్యారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన కృతికా శుక్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పి రవి సుబాష్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సిపిడిసిఎల్) చైర్మన్, ఎండీగా నియమితులయ్యారు.

మైనారిటీ, సంక్షేమ శాఖ కమిషనర్‌‌గా సీహెచ్ శ్రీధర్‌

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఎంవీ శేషగిరి

చేనేత శాఖ కమిషనర్‌గా రేఖారాణి

ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌

సెర్ప్‌ సీఈవోగా వీరపాండ్యన్‌ నియామకం

బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున

సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్‌

భూ సర్వే, సెటిల్‌మెంట్ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు

పౌర సరఫరాల శాఖ ఎండీగా గిరీషా

మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్ జిలాని

ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లా

ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా రవి సుభాష్‌

మెడికల్ సర్వీసెస్ ఎండీగా లక్ష్మీషా

మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి

గృహ నిర్మాణ కార్పొరేషన్‌ ఎండీగా రాజాబాబు

ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌

Tags:    

Similar News