TPCC President Mahesh Kumar Goud : బీజేపీకి ఆ హ‌క్కు లేదు.. కేటీఆర్‌కు సంస్కారం లేదు

సెప్టెంబర్ 17.. 1948 వరకు మన సంస్థానంకు స్వతంత్రం రాలేదని.. దూర దృష్టి ఉన్న నెహ్రూ.. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పంపి దేశంలో విలీనం చేయించారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ అన్నారు.

Update: 2024-09-17 04:11 GMT

సెప్టెంబర్ 17.. 1948 వరకు మన సంస్థానంకు స్వతంత్రం రాలేదని.. దూర దృష్టి ఉన్న నెహ్రూ.. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పంపి దేశంలో విలీనం చేయించారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ అన్నారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తుందని.. తెలంగాణ విలీనం జరిగినప్పుడు బీజేపీ పుట్టనే లేదన్నారు. స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్రనే లేదన్నారు. ఆనాడు ఉన్న ఇప్పటి బీజేపీ అనుబంధ సంఘాలు బ్రిటిష్ల‌కు వంతపాడారని అన్నారు. వల్లభాయ్ పటేల్‌కి బీజేపీకి సంబంధం ఏంటి అని ప్ర‌శ్నించారు. వల్లభాయ్ పటేల్‌ను బీజేపీ తమ‌ నాయకునిగా చెప్పుకుంటున్నారని అన్నారు.

తెలంగాణ విలీనం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ వల్లనే స్వతంత్రం వచ్చింది.. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యింది. పదేళ్లు తెలంగాణను తుంగలో తొక్కారు కేసీఆర్.. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐటీ రంగాన్ని దేశంకి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. చదువుకున్న అనుకుంటున్న కేటీఆర్‌కు సంస్కారం లేదన్నారు. సంస్కారం లేకుండా రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ మాట్లాడుతున్నారు.. పదేళ్లు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా.? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ తల్లిని గౌరవించాలని.. సెక్రటేరియట్ గుండెల్లో విగ్రహం పెడుతుంది ప్రభుత్వం అని పేర్కొన్నారు.

బీజేపీ పెట్టే చిచ్చులో పడదామా..? కాంగ్రెస్ ఇచ్చే సంక్షేమ పథకాలు పొంది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుద్దామా..? ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరు ఎంత ఉంటే వారికి అంత వాటా అని రాహుల్ గాంధీ చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూద్దామ‌న్నారు. 

Tags:    

Similar News