ఫిర్యాదుదారుడిని దారి దోపిడి చేసి రూ.2,00,000/- తస్కరించినందుకు సి.సి.సి. నస్పూర్, రక్షక భట నిలయం

ఫిర్యాదుదారుడిని దారి దోపిడి చేసి రూ.2,00,000/- తస్కరించినందుకు సి.సి.సి. నస్పూర్, రక్షక భట నిలయం లో నమోదు చేసిన నాటి కేసులో నిందితులను రిమాండ్ చేసి మొత్తం దోచుకోబడిన ధనాన్ని జప్తు చేసినందుకు, ఫిర్యాధుదారున్ని రూ.30,000/- లంచం ఇవ్వాలని, లేకపోతే అతన్ని కూడా అట్టి కేసులో నిందితునిగా చేస్తాను అని బెదిరించి ఫిర్యాదుధారుని నుండి సదరు లంచం డబ్బులను ఒక ప్రయివేటు వ్యక్తి అయిన డి.దీపక్ (D, Deepak)ఫోన్ పే లో వేయించుకొన్నందుకు మంచిర్యాల జిల్లాలోని, సి.సి.సి.నస్పూర్ రక్షక భట నిలయాధికారి, ఎస్.ఐ. - ఎన్. సుగాణాకర్ మరియు ప్రైవేట్ వ్యక్తి డి.దీపక్" ల పైన క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసిన తెలంగాణ (Telangana)అనిశా అధికారులు.
అయితే తర్వాత సదరు ఫిర్యాదు ధారుడు, సదరు కేసులో జప్తు చేయబడిన రూ.2,00,000/- గౌరవ కోర్టు నుండి పొందిన ఆర్డర్ లను తీసుకొని, ఎస్.ఐ. సుగాణాకర్ (S.I. Sugunakar)ని సంప్రదించగా, జప్తు చేయబడిన ధనం లో నుండి రూ.1,50,000/- వాడేసినట్టుగా చెప్పి మిగతా రూ.50,000/- మాత్రమే ఇస్తాను అని చెప్పి, ఫిర్యాదుధారుణిచేత రూ.2,00,000/- ముట్టినట్లు సంతకం చేపించుకొన్నాడు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ మరియు ఎక్స్ ద్వారా కూడా తెలంగాణ ఏసీబీ(Telangana ACB )ని సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."
