KTR : మేడిగడ్డ డ్రోన్‌ వివాదం.. కేటీఆర్‌పై నమోదైన కేసుపై హైకోర్టు స్టే

మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ కెమెరాను వినియోగించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) నేతలు కేటీ రామారావు (KTR), గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్‌ల అరెస్టుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది

Update: 2024-08-13 03:24 GMT

మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ కెమెరాను వినియోగించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) నేతలు కేటీ రామారావు (KTR), గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్‌ల అరెస్టుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. విజువల్స్ రికార్డ్ చేయడానికి బ్యారేజీపై జూలై 26న డ్రోన్‌ను ఎగురవేశారని ముగ్గురు బీఆర్‌ఎస్ నాయకులపై నీటిపారుదల శాఖ ఇంజనీర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అ మేర‌కు ఎఫ్ఐఆర్ కూడా న‌మోదైంది. అయితే ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు వేసిన‌ పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ హైకోర్టు ఫిర్యాదుదారుకు తాజాగా నోటీసులు జారీ చేసింది.

బీఆర్‌ఎస్‌ నేతల తరఫు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో.. ఎఫ్‌ఐఆర్‌ రాజకీయ ప్రేరేపితమని వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకుండా ప్ర‌భుత్వం ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కృత్రిమ కొరత సృష్టిస్తోందని ప్రజలకు చూపించేందుకే బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం డ్యామ్‌ను సందర్శించిందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు చూపించిన డ్యామ్ విజువల్స్‌తో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. వాద‌న‌లు విన్న హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌పై స్టే విధించింది. డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమెరాతో వీడియోలు తీస్తే ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందనే అభియోగాలకు పొంతన లేదని.. దీనిపై లోతుగా విచారణ చేస్తామని జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. 

Tags:    

Similar News