Telangana : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. సీఎం ప్ర‌శంస‌లు

సైబర్ నేరాల నియంత్రణలో ఉత్తమ పనితీరును కనబరిచి జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు

Update: 2024-09-10 16:02 GMT

సైబర్ నేరాల నియంత్రణలో ఉత్తమ పనితీరును కనబరిచి జాతీయ స్థాయిలో ప్రశంసా పత్రాన్ని అందుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రథమ వార్షికోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఆ ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేందర్ సింగ్ ల‌కు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సైబర్ నేరాల కట్టడికి జాతీయ స్థాయిలో 'సమన్వయ్' పేరుతో అనుసంధాన వ్యవస్థను రూపొందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషించిన పాత్రకు కేంద్రం నుంచి ప్రశంసలు దక్కడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రణాళికల్లోనూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ కీలక పాత్ర పోషించాలని సీఎం అభిలషించారు.

Similar News