MLC Kavitha : ఫాంహౌస్‌లో తండ్రిని కలిసిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావ‌డంతో జైలు నుంచి బయటకు వచ్చారు.

Update: 2024-08-29 09:47 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావ‌డంతో జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు ఐదున్నర నెలల పాటు ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. బుధ‌వారం హైదరాబాద్ కు చేరుకున్న కవిత ఈరోజు ఎర్రవల్లిలోని త‌న తండ్రి కేసీఆర్‌ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో తన తండ్రి పాదాలకు నమస్కరించి.. ఆయన చేతికి ముద్దు పెట్టారు. కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్.. ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. కవిత వెంట ఆమె భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. కవిత రాకతో ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ కోలాహలంగా మారింది. 10 రోజుల పాటు ఫాంహౌస్ లోనే కవిత విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తుంది.  

Tags:    

Similar News