MLC Kavitha : జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మంగళవారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మంగళవారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో ఆమె కొద్దిసేపటి క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. 166 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ఆమె కొడుకును, భర్తను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను కేసీఆర్ బిడ్డనని.. తప్పు చేయనన్నారు. అనవసరంగా తనను జగమొండిగా మార్చారన్నారు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని.. నన్ను ఇబ్బంది పెట్టినందుకు మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. ఎమ్మెల్సీ కవిత విడుదల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక.. ఈ రోజు ఢిల్లీల్లో విశ్రాంతి తీసుకోనున్న కవిత.. రేపు హైద్రాబాద్‌కు రానునున్నారు.