Minister Tummala Nageswara Rao : సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్
బీఆర్ఎస్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు వాఖ్యానించినట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని ఆయన పేర్కొన్నారు
By : Eha Tv
Update: 2024-06-26 04:03 GMT
బీఆర్ఎస్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు వాఖ్యానించినట్టు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని ఆయన పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో నిరుపేదలకు, అర్హులకే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని.. దుబారాకు దూరంగా పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు.
కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు మరియు రాష్ట్ర అభివృద్ధి రెండు ఈ ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలు అని మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతుభరోసా అలస్యం చేయడానికి కాదు ఆదర్శం చేయడానికే కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.