MLA Prakash Goud : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నేడు మ‌రొక‌రు..!

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు

By :  Eha Tv
Update: 2024-07-13 00:16 GMT

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల పర్వం కొనసాగుతోంది.

ఎన్నిక‌ల‌ త‌ర్వాత‌ కాంగ్రెస్‌లో చేరిన ఎనిమిదో BRS ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. త‌ద్వారా శాసనసభలో BRS బలం 38 నుండి 30కి తగ్గింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కూడా శనివారం కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

డిసెంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో 119 మంది సభ్యుల సభలో 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఆ సంఖ్యను 73కి పెంచుకుంది. ఇందులో ఎనిమిది మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేర‌గా.. మే లో జ‌రిగిన‌ ఉపఎన్నికలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది.

ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన మరో ఐదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో పార్టీలో చేరవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

జూన్ 4న లోక్‌సభ ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి ఒక నెలలోపే ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. జూన్ 21న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జూన్ 24న జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్, జూన్ 28న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జులై 6న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జూలై 12న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు.

మే లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు BRS ఎమ్మెల్యేలు - దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకట్ రావు (భద్రాచలం) - కాంగ్రెస్‌లో చేరారు. వీరు కాక‌ ఆరుగురు BRS ఎమ్మెల్సీలు జూలై 4 రాత్రి కాంగ్రెస్‌లోకి మారారు.

Tags:    

Similar News