Telangana MLCs : ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్
ఉర్దూ వార్తాపత్రిక ది సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారు మొదట జనవరిలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు. అయితే వీరి ప్రమాణ స్వీకారాన్ని తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల నియామకాలను సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
దాసోజు శ్రవణ్ కుమార్, కె. సత్యనారాయణల నామినేషన్‌ను తిరస్కరించిన గవర్నర్ ఉత్తర్వులను మార్చిలో కోర్టు కొట్టివేసింది. ఇటీవల గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎం. కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల నామినేషన్‌లను కూడా రద్దు చేసింది. అయితే.. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ పరిణామంతో తెలంగాణ ఎమ్మెల్సీలుగా అమీర్ అలీఖాన్, ప్రొ.కోదండరామ్ ప్రమాణ స్వీకారం చేశారు.