Paris Olympics : పతకం ఫిక్స్.. ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ ఆమె..!
ఒలింపిక్స్(Olympics)లో ఫైనల్(శుయలన)కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్(Wrestler)గా వినేష్ ఫోగట్(Vinesh Phogat) నిలిచింది.
ఒలింపిక్స్(Olympics)లో ఫైనల్(శుయలన)కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్(Wrestler)గా వినేష్ ఫోగట్(Vinesh Phogat) నిలిచింది. పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో 50 కిలోల మహిళల రెజ్లింగ్ విభాగంలో క్యూబాకు చెందిన గుజ్‌మన్ లోపెజ్‌ను 5-0తో ఓడించి బంగారు పతకం(Gold Medal) సాధించే దిశగా అడుగులు వేసింది.
ఫోగట్ ప్రీ క్వార్టర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యుయి సుసాకిని, క్వార్టర్ ఫైనల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అదే జోరును కొనసాగిస్తూ ఫోగట్ 5-0 తేడాతో లోపెజ్‌ను ఓడించి ఫైనల్స్ బెర్ట్ ఖాయం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో ఫైనల్ బుధవారం జరగనుంది. ఫైనల్‌లో వినేష్ అమెరికాకు చెందిన సారా ఆన్ హిల్డెబ్రాండ్ సవాల్‌ను ఎదుర్కోనుంది.
ఒలింపిక్స్‌లో ఏ విభాగంలోనైనా భారత్(India) నుంచి ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్ వినేశ్ కావడం విశేషం. పురుషుల విభాగంలో సుశీల్ కుమార్(Susheel Kumar), రవి దహియా(Ravi Dahiya)లకు ఒలింపిక్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్నప్పటికీ వీరిద్దరూ రజత పతకాలను మాత్రమే సాధించగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో రెజ్లింగ్‌లో దేశానికే తొలి బంగారు పతక విజేతగా నిలిచే అవకాశం వినేష్‌కి దక్కనుంది. వినేష్ రియో, టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్ర్కమించింది.
ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వినేష్ క్యూబా రెజ్లర్‌కు పాయింట్లు సాధించే అవకాశం ఇవ్వలేదు. లోపెజ్ ప్రారంభ రౌండ్లలో వినేష్ కాలును పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె ఓవర్ డిఫెన్స్ ఆట భారత రెజ్లర్‌కి ఒక పాయింట్ ఆధిక్యాన్ని అందించింది. తొలిరౌండ్‌లో ఆధిక్యం సాధించిన వినేష్ రెండో రౌండ్‌ను దూకుడుగా ప్రారంభించి ప్రత్యర్థి రెజ్లర్ కుడి కాలుపై గట్టి పట్టు సాధించి 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్యూబా రెజ్లర్ వినేష్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ వినేష్ అద్భుతమైన డిఫెన్స్ కారణంగా ఆమె ప్రయత్నం విఫలమైంది.
29 ఏళ్ల వినేష్ తన మూడవ ఒలింపిక్స్ ఆడుతుంది, ఈ గేమ్స్‌లో ఆమె మొదటి పతకానికి ఇప్పుడు కేవలం ఒక విజయం దూరంలో ఉంది. ఒలింపిక్స్ మినహా అన్ని ప్రధాన క్రీడల్లో వినేష్‌కు పతకాలు ఉన్నాయి. ఒక కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం, ఒక ఆసియా గేమ్స్ పతకం, రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్యాలతో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్ పతకాలు ఉన్నాయి. అయితే రియో, టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయింది.