ODI WC 2023 : మా కంటే వారే బాగా ఆడారు.. పిచ్‌ ట్యాంపరింగ్‌పై మాజీ బ్యాటింగ్ కోచ్ క్లారిటీ

2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు గ్రూప్ దశలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది

By :  Eha Tv
Update: 2024-07-25 02:30 GMT

2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు గ్రూప్ దశలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు పిచ్‌ను ట్యాంపరింగ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.

భారత్‌ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్‌ హెడ్‌ 120 బంతుల్లో 137 పరుగుల సాయంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

భారత్ ఓటమి తర్వాత ఫైనల్‌కు ఉపయోగించిన పిచ్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఈ ఆరోపణలపై విరుచుకుపడ్డాడు. ఆట పురోగమిస్తున్న కొద్దీ ఉపరితలం నెమ్మదిస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ భావించిందని.. అది బ్యాటింగ్‌కు మంచిదని చెప్పాడు. పిచ్ భిన్నంగా ఉందనే ఊహాగాన‌ల‌ను నేను విన్నాను. ఇది నేను అస్సలు అంగీకరించను, ఫైనల్‌లో ఆట సాగుతున్న కొద్దీ పిచ్ మెరుగుపడింది. ఇది నెమ్మదిగా ఉంటుందని మేము ఊహించాము.. మేము ఎక్కువ పరుగులు సాధించాం.. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి.. టోర్నమెంట్ గెలవడానికి కొంచెం అదృష్టం కావాలి. ఆ రోజు వారు మా కంటే బాగా ఆడారని అన్నారు. 

Tags:    

Similar News