BCCI : కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల భారత మాజీ బ్యాట్స్‌మెన్‌ గౌతమ్‌ గంభీర్‌ను జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది.

By :  Eha Tv
Update: 2024-07-12 04:59 GMT

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల భారత మాజీ బ్యాట్స్‌మెన్‌ గౌతమ్‌ గంభీర్‌ను జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది. గంభీర్ బాధ్యతలు చేపట్టకముందే బోర్డు అతనికి షాకిచ్చింది. నివేదిక ప్రకారం.. గంభీర్ ఫీల్డింగ్ కోచ్ కోసం జాంటీ రోడ్స్ పేరును ప్రతిపాదించాడు. అయితే గంభీర్ ప్ర‌తిపాద‌న‌ను బోర్డు అంగీకరించలేదు. రోడ్స్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా పరిగణిస్తారు. అయితే సహాయక సిబ్బంది భారతీయులు మాత్రమే ఉండాలని BCCI వాదిస్తోన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

రోడ్స్.. గంభీర్ గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి పనిచేశారు. ఈ టీమ్‌కు గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. అయితే బీసీసీఐ మాత్రం సహాయక సిబ్బందిని మాత్రం భారతీయుడిని మాత్రమే తీసుకోవాలని కోరుతుంది. గత ఏడేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందని.. ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి మార్పును బోర్డు కోరుకోవడం లేదు.

హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సహాయక సిబ్బందిని విదేశీయులను తీసుకోకూడదనే విధానాన్ని బీసీసీఐ అనుసరించాలని కోరుతోంది. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో సహాయక సిబ్బంది సేవలు కూడా ముగిశాయి. వీరిలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు. టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత వీరందరి పదవీకాలం ముగిసింది.

నివేదిక ప్రకారం.. జాంటీ రోడ్స్ వలె గంభీర్ బౌలింగ్ కోచ్ కోసం వినయ్ కుమార్ పేరును సిఫార్సు చేసాడు. అయితే BCCI ఇందుకు మద్దతు ఇవ్వలేదు. ఇంతలో గంభీర్ నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు ర్యాన్ టెన్ డస్కేట్‌ను సపోర్ట్ స్టాఫ్‌లో చేర్చుకోవాలని కోరినట్లు కూడా నివేదించబడింది. డాస్కేట్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యొక్క ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. అనేక ఇతర లీగ్‌లలో కూడా భాగమై ఉన్నాడు.

గంభీర్ ప్రతిపాదనల నేప‌థ్యంలో సపోర్టు స్టాఫ్ విషయంలో బీసీసీఐ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ రేసులో పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ఎవరి పేరును వెల్లడించలేదు. ఈ నెలాఖరులో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం గంభీర్ టీమిండియాతో చేరనున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News