IND vs BAN : బంగ్లాపై భారీ విజ‌యం సాధించిన భార‌త్‌

సూపర్ ఎయిట్ దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు పటిష్ట ప్రదర్శనతో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

By :  Eha Tv
Update: 2024-06-23 04:29 GMT

సూపర్ ఎయిట్ దశలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు పటిష్ట ప్రదర్శనతో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. త‌ద్వారా టీమిండియా దాదాపు సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించడం ఖాయమైంది. మరోవైపు బంగ్లాదేశ్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోవడంతో వారి పోరాటం దాదాపుగా ముగిసింది.

హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో రాణించ‌డంతో పాటు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నేతృత్వంలోని బౌలర్ల బలమైన ప్రదర్శన కారణంగా సూపర్ ఎయిట్ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 50 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్లకు 196 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. త‌ద్వారా భారత్ టోర్నీలో వరుసగా ఐదో మ్యాచ్‌లో విజయం సాధించింది. జూన్ 24న జరిగే చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జట్టు తలపడనుంది.

వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్ వన్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు దాదాపు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైన‌ల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో హార్దిక్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కుల్దీప్ శక్తివంతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తరఫున కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో అత్యధికంగా 40 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ జట్టు సూపర్ ఎయిట్ దశలో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది.

Tags:    

Similar News