US Masters T10 : మ‌రో లీగ్‌లో ఆడేందుకు సిద్ధ‌మైన‌ సురేశ్ రైనా

అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రారంభమయ్యే యూఎస్ మాస్టర్స్ టీ10 రెండో సీజన్‌లో భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా చికాగో ప్లేయర్స్ జట్టులో చేరాడు

Update: 2024-09-09 14:28 GMT

అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రారంభమయ్యే యూఎస్ మాస్టర్స్ టీ10 రెండో సీజన్‌లో భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా చికాగో ప్లేయర్స్ జట్టులో చేరాడు. ఈ లీగ్ నవంబర్ 8 నుంచి జరగనుంది. రెండవ సీజన్‌కు ముందు చికాగో ప్లేయర్స్ రైనాను జ‌ట్టులో చేర్చుకుంది. భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్, శ్రీలంక మాజీ ఆటగాడు ఇసురు ఉదానా ఇప్పటికే జట్టులో ఉన్నారు.

చికాగో ప్లేయర్స్‌లో చేరిన సందర్భంగా సురేష్ రైనా మాట్లాడుతూ.. నేను చికాగో ప్లేయర్స్‌లో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నాను. US మాస్టర్స్ T10 వంటి లీగ్‌లో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. T10 గేమ్ T20 కంటే వేగంగా ఉంటుంది. నేను చాలా ఆనందించాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని క్రికెట్ అభిమానులను మా జట్టు పూర్తిగా అలరిస్తుందని నాకు నమ్మకం ఉందన్నాడు.

చికాగో ప్లేయర్స్‌లో న్యూజిలాండ్ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్ జెస్సీ రైడర్, భారత క్రికెటర్లు గురుకీరత్ సింగ్, ఈశ్వర్ పాండే, అనురీత్ సింగ్ కూడా ఉన్నారు. US మాస్టర్స్ T10 సీజన్ 2 నవంబర్ 8 నుండి నవంబర్ 17, 2024 వరకు టెక్సాస్‌లో జ‌రుగుతుంది. త్వరలో ఈ టోర్నీలో ఆడే దిగ్గజాలందరూ USAలో కనిపించనున్నారు. US మాస్టర్స్ T10 మొదటి సీజన్ ఫ్లోరిడాలో 18 ఆగస్టు నుండి 27 ఆగస్టు 2023 వరకు జరిగింది. దీనిలో టెక్సాస్ ఛార్జర్స్ ఫైనల్‌లో న్యూయార్క్ వారియర్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. 

Tags:    

Similar News