SA vs AFG : 32 ఏళ్ల సుదీర్ఘ కల.. టీ-20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా కన్న 32 సంవత్సరాల సుదీర్ఘ కల నేడు నిజమయ్యింది. ఐసీసీ టోర్నమెంట్‌లలో మొదటిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది.

By :  Eha Tv
Update: 2024-06-27 06:11 GMT

దక్షిణాఫ్రికా(South Africa Got T20 World Cup Final After 32 Years) కన్న 32 సంవత్సరాల సుదీర్ఘ కల నేడు నిజమయ్యింది. ఐసీసీ టోర్నమెంట్‌లలో మొదటిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. టీ-20 ప్రపంచకప్‌(T-20 World Cup)లో అఫ్గనిస్తాన్‌(Afghanistan)ను సెమీఫైనల్‌లో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో కొన్ని సంచనాలు సృష్టించిన అఫ్గనిస్తాన్‌ సెమీస్‌లో మాత్రం చేతులెత్తేసింది. వార్‌ వన్‌సైడ్‌గా సాగింది. జాన్సెన్‌(Jansen), షంసీ బౌలింగ్‌లో అఫ్గన్‌ బ్యాట్స్‌మన్‌ ఆడలేకపోయారు. మొత్తంగా 56 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది అఫ్గనిస్తాన్‌. మొదటి ఓవర్‌ నుంచే వికెట్ల వేటను ఆరంభించిన దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రత్యర్థిని 11 ఓవర్లలోనే ఆలౌట్‌ చేశారు. టీ-20 ప్రపంచకప్‌ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్‌ చేసిన జట్టుగా అఫ్గనిస్తాన్‌ ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. మార్కో జాన్సెన్(Marco Jansen), తబ్రేజ్‌ షంసీ(Tabraiz Shamsi) మూడేసి వికెట్లు తీసుకోగా, కగిసో రబాడా(Kagiso Rabada) రెండు వికెట్లు, అన్రిచ్‌ నోకియా రెండు వికెట్లు తీసుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన దక్షిణాఫ్రికా తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ డికాక్‌ను కోల్పోయింది. అయితే తర్వాత మార్క్‌రమ్‌(Markram) , రీజా హెండిక్స్‌(Reeza Hendricks)లు ఏ మాత్రం కంగారుపడకుండా జట్టును గెలిపించారు. 8.5 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగియడం విశేషం.దక్షిణాఫ్రికా కన్న 32 సంవత్సరాల సుదీర్ఘ కల నేడు నిజమయ్యింది. ఐసీసీ టోర్నమెంట్‌లలో మొదటిసారి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది.

Tags:    

Similar News