Paris Paralympics 2024 : చరిత్ర సృష్టించిన‌ 17 ఏళ్ల శీతల్ దేవి..!

పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ క్రీడాకారులు బలమైన ప్రదర్శన కనబరిచి పతకాలు సాధించగా.. తాజాగా ఆర్చర్లు కూడా అద్భుతాలు చేశారు

Update: 2024-09-03 03:27 GMT

పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ క్రీడాకారులు బలమైన ప్రదర్శన కనబరిచి పతకాలు సాధించగా.. తాజాగా ఆర్చర్లు కూడా అద్భుతాలు చేశారు. శీతల్ దేవి, రాకేష్ కుమార్ జోడీ సోమవారం రాత్రి మరో పతకాన్ని సాధించింది. శీతల్, రాకేష్‌ల జోడి ఇటలీ జంట ఎలోనోలా సార్తీ మరియు మాటియో బొనాసినాతో పోటిప‌డింది. హోరాహోరిగా సాగిన ఈ పోరులో భారత జోడీని విజయం వ‌రించింది. ఈ మ్యాచ్‌లో శీతల్, రాకేష్ జోడి ఇట‌లీ జంట‌పై 156-155తో విజయం సాధించి పతకాన్ని కైవసం చేసుకుంది. పారాలింపిక్స్‌లో భారత్ ఆర్చరీలో పతకం సాధించడం ఇది రెండోసారి కావ‌డం విశేషం.

ఈ విజయం శీతల్‌కు చాలా ప్రత్యేకమైంది. పారాలింపిక్ క్రీడల్లో దేశం త‌రుపున‌ పతకం సాధించిన తొలి మహిళా ఆర్చర్‌గా శీతల్‌ నిలిచింది. చివరి క్షణాల్లో ఇద్దరు ఆటగాళ్లు గట్టి ఆటతీరును ప్రదర్శించారు. భారత్ 10, 9, 10, 10 లక్ష్యాలను చేధించి 155 పరుగులకు చేరుకుంది. ఇటలీ జట్టు 9, 9, 10, 10 స్కోరు చేయడంతో ఈ స్కోరును సమం చేసింది. ఇక్కడ స్కోరు 155-155గా మారింది. అయితే.. చాలా నిశితంగా పరిశీలించిన తర్వాత.. న్యాయనిర్ణేతలు శీతల్ చివరి షాట్‌కు 9కి బదులుగా 10 పాయింట్లు ఇచ్చారు. తద్వారా భారత్ పతకాన్ని గెలుచుకుంది.

సెమీఫైనల్స్‌లోనూ నాటకీయ రీతిలో భారత్‌ విజయం సాధించింది. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ షూటాఫ్‌లో విజయం సాధించింది. ఇరాన్ జోడీ ఫతేమా హేమతీ, హదీ నోరి గట్టిపోటీ ఇవ్వడంతో మ్యాచ్ 152-152తో సమమైంది. షూటాఫ్‌లో భారత్ 10 పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంది.

Tags:    

Similar News