Morne Morkel : స్టార్ బౌలర్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకొచ్చిన గంభీర్..!
భారత క్రికెట్ జట్టు కొత్త బౌలింగ్ కోచ్‌ని ప్రకటించారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు
భారత క్రికెట్ జట్టు కొత్త బౌలింగ్ కోచ్‌ని ప్రకటించారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ జట్టు కోచ్‌గా వచ్చాడు. ఇప్పుడు భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులయ్యారు. అతను పరాస్ మాంబ్రే స్థానంలో కోచ్‌గా వచ్చాడు. వచ్చే నెలలో 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ సిరీస్ నాటికి భారత జట్టులో మోర్కెల్ చేరనున్నాడు.
మోర్నీ మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. గౌతమ్ గంభీర్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమించినప్పుడు.. అతను బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ పేరును సూచించాడు.. అది ఇప్పుడు ఆమోదించబడింది. మోర్నీ మోర్కెల్ ఇంతకు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కూడా ఉన్నారు.
గౌతమ్ గంభీర్, మోర్నీ మోర్కెల్ గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కోసం కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్య రిలేషన్స్ కూడా చాలా బాగున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్ మెంటార్‌గా ఉండగా.. మోర్కెల్ ఫ్రాంచైజీకి బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. IPL 2024లో గౌతమ్ గంభీర్ లక్నోను విడిచిపెట్టి.. అతని పాత ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరాడు. అయినప్పటికీ.. మోర్నే మోర్కెల్ ఇప్పటికీ LSGలోనే ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మోర్కెల్ 86 టెస్టులు, 117 ODIలు, 44 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మోర్కెల్ టెస్టుల్లో 309 వికెట్లు తీశాడు. అంతేకాదు వన్డేల్లో 188 వికెట్లు, టీ20ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. మోర్కెల్‌కు దక్షిణాప్రికా స్టార్ బౌలర్‌గా మంచి పేరుంది.