2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Trophy) నుంచి పాకిస్తాన్(Pakistan) వైదొలగవచ్చని వార్తలు వస్తున్నాయి.

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Trophy) నుంచి పాకిస్తాన్(Pakistan) వైదొలగవచ్చని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌ వెళ్లేందుకు భారతదేశం(India) నిరాకరించిన నేపథ్యంలో

ఐసీసీ ట్రోఫీ నుంచి పాక్‌ వైదలగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఏదైనా ఐసిసి లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) ఈవెంట్‌లలో భారత్‌తో ఆడకుండా ఉండాలనిని పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డును(Pakistan cricket board) కోరే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఐసీసీ నుంచి స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. బీసీసీఐ తన జట్టును పాకిస్థాన్‌కు పంపించడం లేదని పీసీబీకి బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్ సిస్టమ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అంశంపై పీసీబీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది ఆసియా కప్‌లో భారతదేశం మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగ్గా.. ఇతర మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరిగాయి. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించారు. భారత్‌తో క్రికెట్ సంబంధాలపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే ఐసీసీకి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని పీసీబీ అధికారులు అభిప్రాయపడ్డారు.

Eha Tv

Eha Tv

Next Story