Mohammed Shami : నా చిన్న యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. కూతురికి ష‌మీ విషెష్‌

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కుమార్తె ఐరా పుట్టినరోజు సందర్భంగా ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నాడు

By :  Eha Tv
Update: 2024-07-18 03:17 GMT

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కుమార్తె ఐరా పుట్టినరోజు సందర్భంగా ఒక అందమైన సందేశాన్ని పంచుకున్నాడు. తన కుమార్తె చిత్రాలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేస్తూ.. షమీ ప్రత్యేక సందేశాన్ని వ్రాసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భార్యతో వివాదం తర్వాత.. షమీ తన కుమార్తెకు దూరంగా ఉంటున్నాడు.

మహ్మద్ షమీ 2014లో హసిన్ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. 2015లో వీరిద్దరికీ ఆడపిల్ల పుట్టగా.. త‌న‌కు ఐరా అని పేరు పెట్టారు. ఆ తర్వాత షమీ, హసీన్‌ జహాన్‌ల మధ్య గొడవ జరిగి ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం అతని కూతురు తన తల్లి వద్దే ఉంటుంది. జూలై 17న ఐరా పుట్టినరోజు. ఈ నేప‌థ్యంలో షమీ తన కూతురికి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపాడు.

ఐరా పుట్టినరోజు సందర్భంగా షమీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కుమార్తె చిత్రాన్ని పంచుకున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దానితో పాటు ఓ లవ్లీ మెసేజ్ కూడా రాశారు. షమీ ఇలా రాశాడు, 'నా చిన్న యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నీకు ప్రేమ, విజయం, ఆనందం నిండి ఉంటుందని నేను ఆశిస్తున్నానని రాశాడు. ఈ మెసేజ్‌కు అభిమానులు కూడా త‌మ‌దైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.

2023 వన్డే ప్రపంచకప్ నుంచి మహ్మద్ షమీ క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అతడికి అకిలెస్ స్నాయువు శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతడు మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అలాగే అతడు T20 ప్రపంచ కప్‌కు కూడా దూర‌మ‌య్యాడు. అయితే షమీ NCAలో పునరావాసంలో ఉన్నాడు. అతను బౌలింగ్ చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం వైరల్‌గా మారింది.

Tags:    

Similar News