Manu Bhaker: మార్మోగిపోతున్న మను భాకర్ పేరు
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ బోణీ కొట్టింది
By : Eha Tv
Update: 2024-07-28 10:51 GMT
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ బోణీ కొట్టింది. భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. 221.7 పాయింట్లతో మను భాకర్ మూడవ స్థానంలో నిలిచింది. దక్షిణకొరియాకు చెందిన వైజే ఓహ్ 243.2 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. దక్షిణకొరియాకే చెందిన వైజే కిమ్241.3 పాయింట్లతో రజతం గెలుచుకుంది. టైటిల్ పోరులో మను భాకర్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఒలింపిక్స్‌లో షూటింగ్ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది.
మను భాకర్ ఫైనల్ రౌండ్ ను అద్భుతంగా ప్రారంభించింది. మొదటి ఐదు షాట్ల తర్వాత 50.4 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మను భాకర్ రెండో రౌండ్‌లో 100.3 పాయింట్లు సాధించింది. 121.2 పాయింట్లతో 12 షాట్ల సమయంలో రెండో స్థానంలో కొనసాగింది. ఫైనల్ సమయానికి 221.7 పాయింట్లు సాధించి దేశానికి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.