Vinesh Phogat : అమ్మా.. నీ కల, నా ధైర్యం చెదిరిపోయింది.. రెజ్లింగ్‌కు వినేష్ గుడ్‌బై

అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) రిటైర్మెంట్(Riterment) ప్రకటించింది.

Update: 2024-08-08 02:54 GMT

అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) రిటైర్మెంట్(Riterment) ప్రకటించింది. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపింది. ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్‌లో తన తల్లిని గుర్తు చేసుకుంటూ.. తన ధైర్యం విచ్ఛిన్నమైందని రాసింది. అంతకుముందు రెజ్లర్ వినేష్.. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌(Sports Arbitration)కు.. ఒలింపిక్ రజత పతకాన్ని(Silver Medal) త‌న‌కు అందించాలని విజ్ఞప్తి చేసింది. ఆమె అప్పీలు(Appeal)పై ఈరోజు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయానికి ముందే.. వినేష్ ఫోగట్ తన రిటైర్మెంట్ ప్రకటించి లక్షలాది మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది.

తన కెరీర్‌(Career)ను ప్రస్తావిస్తూ.. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024' అని రాసింది. ఎమోషనల్ అయిన 29 ఏళ్ల రెజ్లర్ వినేష్ తన తల్లిని గుర్తుచేసుకుని ఆమెకు క్షమాపణలు చెప్పి.. 'అమ్మా, నా నుండి రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయాను. క్షమించండి.. నీ కల, నా ధైర్యం చెదిరిపోయింది. ఇప్పుడు ఇంతకంటే బలం నాకు లేదని ఎమోష‌న‌ల్ పోస్టులో రాసింది.

బుధవారం అర్థరాత్రి వచ్చిన వార్తల ప్రకారం.. పారిస్‌లోని స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.51 గంటలకు.. వినేష్ తనకు రజత పతకాన్ని ప్రదానం చేయాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఎఎస్) ను ఆశ్రయించింది. వినేష్‌ మంగళవారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే బుధవారం ఆమె బరువును కొలిచినప్పుడు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీని తర్వాత ఆమెపై అనర్హత వేటు పడింది. స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌ను క్రీడల మధ్యవర్తిత్వ న్యాయస్థానం అని కూడా అంటారు. మీడియా కథనాల ప్రకారం.. వినేష్ ఇప్పుడు స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌లో ఓ విజ్ఞప్తి మాత్రం చేసింది. తనకు కనీసం రజత పతకం ఇవ్వాలని కోరింది.

Tags:    

Similar News