IND vs ZIM : నాలుగో టీ20లో భారత్ విక్టరీ.. సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యం
భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం సాయంత్రం నాలుగో మ్యాచ్ జరిగింది
భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం సాయంత్రం నాలుగో మ్యాచ్ జరిగింది. మరుమణి, మాధవరెల 63 పరుగుల భాగస్వామ్యంతో తొలుత బ్యటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. జవాబుగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌ల అజేయ భాగస్వామ్యంతో టీమిండియా 15.2 ఓవర్లలో 156 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆదివారం (జూలై 14) జరగనుంది.
153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ మంచి ప్రదర్శన చేశారు. జింబాబ్వేపై ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. జైస్వాల్ 29 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేయగా.. గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 35 బంతులు తీసుకున్నాడు. వీరిద్దరూ జింబాబ్వే బౌలర్లకు గట్టిగా క్లాస్ పీకి 28 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించారు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 53 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. కాగా, గిల్ 39 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరూ అజేయంగా నిలిచారు.