Harmanpreet Kaur : టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకునే సత్తా భారత జట్టుకు ఉంది

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి ముందు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విలేకరుల సమావేశం నిర్వహించారు

Update: 2024-09-24 13:42 GMT

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి ముందు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడిన ఆమె.. మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకునే సత్తా భారత జట్టుకు ఉందని అన్నారు. మహిళల T20 ప్రపంచ కప్ 2024 అక్టోబర్ 3 నుండి ప్రారంభం కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది.

మహిళల T20 ప్రపంచ కప్ 2024లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి, వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. పాకిస్థాన్‌తో కలిసి భారత జట్టు గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకుంది. వీటితో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లూ ఈ గ్రూప్‌లో ఉన్నాయి.

మహిళల T20 ప్రపంచ కప్ 2020లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు టీమ్‌ఇండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టైటిల్‌ గెలుచుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేసింది.

ఆస్ట్రేలియాను ఎప్పుడైనా ఓడించగలమని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది. ఆస్ట్రేలియా జట్టు బాగుందని.. అందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. ఆస్ట్రేలియాను బాగా దెబ్బతీయగల జట్లలో భారత్ కూడా ఒకటని వారికి తెలుసని హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలవడమే మా జట్టు కల.. అలా చేయగల సామర్థ్యం మాకు ఉందని నేను విశ్వసిస్తున్నాను. మేము ఆస్ట్రేలియాలో జరిగిన‌ 2020 మహిళల T20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాము. దక్షిణాఫ్రికాలో జరిగే 2023 ఎడిషన్‌లో కూడా రాణించాం. అతిపెద్ద వేదికపై విజయం సాధించడానికి జట్టుకు ఏమి అవసరమో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ చూపిస్తుందని పేర్కొంది.

గ్రూప్ A: ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక

గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్

మహిళల టీ20 ప్రపంచకప్ 2024కు భారత జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), యాస్తికా భాటియా (wk), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజ్నా సజీవన్.

Tags:    

Similar News